- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HCA Scam: ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అవకతవకల కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు అయింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అవకతవకల కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు అయింది. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు సహా పలువురు మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్‌ను మల్కాజ్‌గిరి కోర్టు(Malkajgiri Court) విచారించింది. హెచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాస్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జగన్ మోహన్ రావును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే.. ఫోర్జరీ చేసిన పత్రాలతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవిని దక్కించుకోవడంతోపాటు అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారంటూ అధ్యక్షుడు జగన్మోహనరావు తదితరులను ఈ నెల 9న సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.






