HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్

by Gantepaka Srikanth |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్(HCA) జగన్మోహన్ రావు(Jaganmohan Rao)ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్(HCA) జగన్మోహన్ రావు(Jaganmohan Rao)ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే HCA ప్రెసిడెంట్ హోదాలో SRH యాజమాన్యాన్ని బెదిరించారని నిర్ధారణ కావడంతో బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన డిమాండ్‌కు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో.. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో వీఐపీ గ్యాలరీకి జగన్మోహన్ రావు తాళాలు వేశారు. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ అనంతరం సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story