- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియుడితో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియో పంపిన భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య
భార్య వేధింపులు తట్టుకోలేక మరో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. రోహ్తక్ ప్రాంతానికి చెందిన మగన్ అలియాస్ అజయ్ అనే వ్యక్తి తన భార్య, ఆ

దిశ, వెబ్ డెస్క్: భార్య వేధింపులు తట్టుకోలేక మరో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. రోహ్తక్ ప్రాంతానికి చెందిన మగన్ అలియాస్ అజయ్ అనే వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడు వేధించడంతో సూసైడ్ చేసుకున్నాడు. మగన్ భార్య దివ్య దీపక్ అనే పోలీస్ అధికారితో అక్రమసంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా అతడితో సన్నిహితంగా ఉన్న వీడియోను భర్తకు పంపి వేధింపులకు పాల్పడింది. దీంతో బాధితుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియోలో మగన్ మాట్లాడుతూ... దివ్య ఆమె ప్రియుడు కలిసి నా తండ్రిని చంపి ఆస్తి అమ్మేసి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇటీవలే తన బ్రేస్ లెట్ మరియు సాగుచేసిన ధాన్యం అమ్మి వాళ్లకు రూ.3.5 లక్షలు ఇచ్చానని చెప్పాడు. మరో రూ.1.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విషయంపై లాయర్‌ను కలిసానని, అమ్మాయిల పట్ల కనికరం ఉంటుందని ఆమె ఒకసారి ఏడిస్తే ఎవరైనా క్షమిస్తారని చెప్పాడన్నారు. దీంతో మగవారిని కాపాడటానికి చట్టాలు తీసుకురావాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చనిపోయిన తరవాత తన కుమారుడు తన తల్లిదండ్రుల వద్దనే ఉండాలని కోరుతూ చెట్టుకు ఉరివేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో మగన్‌ను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.






