- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్ లో దారుణం.. రైలులో బాలికకు లైంగిక వేధింపులు !
రైలులో ఓ మైనర్ బాలికను టార్గెట్ చేసి లైంగిక వేధింపులకు గురి చేశాడు ఓ దుర్మార్గుడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో.. వాష్

దిశ, వెబ్ డెస్క్: రైలులో ఓ మైనర్ బాలికను టార్గెట్ చేసి లైంగిక వేధింపులకు గురి చేశాడు ఓ దుర్మార్గుడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో.. వాష్ రూమ్ కు వెళ్లిన బాలికను ( Minor Girl) లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. మైనర్ బాలిక వీడియోలు తీసి.. లోబర్చుకునే కుట్రలకు దిగాడు. ఈ సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ( Secunderabad Railway Police Station) తాజాగా జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ లో ( Raxel-Secunderabad Express ) ఒడిశా రాష్ట్రానికి ( Odisha State ) చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తోంది.
ఇక ఆ కుటుంబంలో 16 ఏళ్ల మైనర్ బాలిక కూడా ఉంది. అయితే ఆ బాలిక అర్థరాత్రి 2 గంటల కు వాష్ రూమ్ కు వెళ్ళింది. ఆ బాలిక ఒంటరిగా వెళ్లడం గమనించాడు దుండగుడు. ఈ తరుణంలోనే బాలికను లైంగికంగా వేధించడంతో పాటు వీడియోలు చిత్రీకరించాడు ఆ దుర్మార్గుడు. ఆ మైనర్ బాలికని దారుణంగా కొట్టి, అనుభవించే ప్రయత్నం చేసాడు. కానీ ఆ దుండగుడు నుంచి తప్పించుకుని... కుటుంబ సభ్యులకు అసలు విషయాన్నీ చెప్పింది బాలిక. ఈ తరుణంలోనే రైల్వే పోలీసులకు బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






