HYD: మేయర్ గద్వాల విజయలక్ష్మికి వేధింపులు

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-07 15:32:28  IST  )

హైదరాబాద్‌ మేయర్(HYD Mayor) గద్వాల విజయలక్ష్మి(Gadwal Vijayalaxmi)కి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి వేధింపులకు(Harassment Calls) గురిచేశారు.

HYD: మేయర్ గద్వాల విజయలక్ష్మికి వేధింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ మేయర్(HYD Mayor) గద్వాల విజయలక్ష్మి(Gadwal Vijayalaxmi)కి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి వేధింపులకు(Harassment Calls) గురిచేశారు. ఈ మేరకు ఆమె బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. నాతో పాటు, నా తండ్రి కే.కేశవరావు అంతు చూస్తా అంటూ బెదిరించడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిడుతున్నారని ఆమె కంప్లైంట్‌లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. బోరబండలో చనిపోయిన సర్దార్‌కి సంబంధించిన వ్యక్తులమని అగంతకులు చెబుతున్నారని మేయర్ అన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story