- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రీల్స్ కోసం విద్యార్థినులపై వేధింపులు.. సగం గుండు కొట్టి ఊరేగించిన పోలీసులు
కాలేజీలో విద్యార్థినులను అసభ్య పదజాలంతో వేధిస్తూ, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ చేసిన పోకిరీలకు పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. వారికి సగం గుండు, సగం మీసం చేయించి ఊర్లో ఊరోగించారు. మిగిలిన జుట్టుకు పిలకలు వేసి తల్లిదండ్రులే గుర్తు పట్టరాకుండా తయారు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కాలేజీలో విద్యార్థినులను అసభ్య పదజాలంతో వేధిస్తూ, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ చేసిన పోకిరీలకు పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. వారికి సగం గుండు, సగం మీసం చేయించి ఊర్లో ఊరోగించారు. మిగిలిన జుట్టుకు పిలకలు వేసి తల్లిదండ్రులే గుర్తు పట్టరాకుండా తయారు చేశారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇద్దరు పోకిరీలు ప్రతిరోజు కాలేజీ వద్ద నిలుచుని వచ్చీపోయే విద్యార్థినులను వేధిస్తూ, అసభ్య పదజాలంతో తిడుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వీడియోలకు లైక్స్, కామెంట్స్ పెరగటంతో పోకిరీల వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. దీంతో వారిపై దృష్టి పెట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గుండు గీసి వారి జుట్టుకు పిలకలు వేసి ఊరేగించారు. వారితో విద్యార్థినులకు స్వారీ చెప్పించారు. జీవితంలో ఎప్పుడూ వేధింపులకు పాల్పడము అంటూ పోకిరీలు వేడుకున్నారు. ఇక ఇంతకాలం అమ్మాయిలను వేధించి వీడియోలు వైరల్ చేయగా ఇప్పుడు వాళ్ల వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






