భ‌ర్త వేధింపులు తాళ‌లేక గృహిణి ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |

భర్త వేధింపులు తాళలేక బావిలో దూకి గర్భిణీ ఆత్మహత్యకు పాల్ప‌డిన ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా కొరివి మండ‌ల కేంద్రంలో బుధ‌వారం రాత్రి చోటు చేసుకుంది.

భ‌ర్త వేధింపులు తాళ‌లేక గృహిణి ఆత్మ‌హ‌త్య
X

దిశ, మ‌రిపెడ (కుర‌వి) : భర్త వేధింపులు తాళలేక బావిలో దూకి గర్భిణీ ఆత్మహత్యకు పాల్ప‌డిన ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా కొరివి మండ‌ల కేంద్రంలో బుధ‌వారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బోల‌గాని స‌తీష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కుర‌వి మండ‌ల కేంద్రంలోని చెంచు కాల‌నీకి చెందిన గుజ్జుల మ‌ధుకు రెండేళ్ల క్రితం ర‌మ‌ణ‌(20) పెళ్లి జ‌రిగింది. ఆమె 7 నెల‌ల గ‌ర్భిణీ. చెంచు కులానికి చెందిన వీరు సంచార జీవితం కొన‌సాగిస్తున్నారు. గ‌త కొంత‌కాలంగా భార్య‌, భ‌ర్త మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ట్టు బంధువులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో రాత్రి మ‌ద్యం మ‌త్తులో భార్య‌తో ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు భ‌ర్త‌. దీంతో మ‌ధు భార్య ర‌మ‌ణ పై భౌతిక దాడి చేశాడు. మ‌న‌స్థాపం చెందిన ర‌మ‌ణ బుధ‌వారం రాత్రి బావిలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. మృతురాలు త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై తెలిపారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Next Story