- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికటించిన హల్దీ ఫంక్షన్.. పెళ్లి కూతురు మృతి
మధ్యప్రదేశ్‌లోని ఖన్‌గోర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కస్రావాడ్ అనే గ్రామంలో జరిగిన హల్దీ వేడుక వికటించి 21 ఏళ్ల రాఖీ అనే యువతి మృతి చెందింది. పెళ్లికి ముందు ఆచారం ప్రకారం రాఖీ ఇంట్లో హల్దీ వేడుక నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఖన్‌గోర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కస్రావాడ్ అనే గ్రామంలో జరిగిన హల్దీ వేడుక వికటించి 21 ఏళ్ల రాఖీ అనే యువతి మృతి చెందింది. పెళ్లికి ముందు ఆచారం ప్రకారం రాఖీ ఇంట్లో హల్దీ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో పెళ్లి కూతురితో పాటు ఇతర బంధువులు పాల్గొన్నారు. ఫంక్షన్ లో అతిధులు, బంధువులు రాఖీకి పసుపుతో పాటు ఓ పర్ఫ్యూమ్ కలిపి పూయగా అది వికటించింది. పెళ్లి కూతురు గొంతు వాచిపోవడంతో పాటు పెదవులు ఉబ్బిపోయాయి. శరీరం అంతటా ఎర్రటి దద్దుర్లు వచ్చాయి. దీంతో వెంటనే తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే గొంతు మరింత వాచిపోయింది.
ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యానికి ఎక్కుడ ఖర్చు అవ్వడంతో డబ్బులు లేక యువతి కుటుంబ సభ్యులు డబ్బులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. అంబులెన్స్ లో వెళుతున్న సమయంలోనే ఆరోగ్యం మరింత విషమించి యువతి మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఇంటిముందు వేసిన మండపాన్ని తొలగించి, పెళ్లి జరిపించాల్సిన రోజే అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఘటన యువతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఖర్గోన్ జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ దౌలత్ సింగ్ చౌహాన్ స్థానిక వైద్యాధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. యువతికి రాసిన పసుపు, పర్ఫ్యూమ్ ల శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.






