కండలు తిరిగిన వీరుడు.. వివాహిత వేధింపులు భరించలేక సూసైడ్

by Naga Rani Yarlagadda |

వివాహిత వేధింపులు భరించలేక రాష్ట్రస్థాయి ఫిట్నెస్ ట్రైనర్ ప్రాణాలు తీసుకున్నాడు.

కండలు తిరిగిన వీరుడు.. వివాహిత వేధింపులు భరించలేక సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వివాహిత వేధింపులు భరించలేక 28 ఏళ్ల రాష్ట్రస్థాయి ఫిట్నెస్ ట్రైనర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకోగా.. స్థానికంగా కలకలం రేపింది. శనివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లిన దిలీప్ (28) తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆ తర్వాత అతని సోదరికి యోగిత అనే మహిళ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో దిలీప్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా మెసేజ్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు కంగారుపడి గది తలుపులు బద్దలుకొట్టగా.. అతని విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ టీమ్ తో స్పాట్ కు చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. దిలీప్ కుటుంబ సభ్యులు ఓ మహిళ వేధింపులే అతని మరణానికి కారణమని ఆరోపించారు. జిమ్ లో 42 ఏళ్ల వివాహితతో ఏర్పడిన పరిచయం చనువుగా మారగా.. ఆమె తరచూ డబ్బు, ఆస్తి కోసం బ్లాక్ మెయిల్ చేసిందని, ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లగా.. ఆమె భర్త సమక్షంలో రాజీ కుదిర్చారని తెలిపారు. అయినా వేధింపులు ఆగకపోవడంతోనే ప్రాణాలు తీసుకున్నాడని వాపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story