- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవీఎంసీ కమిషనర్ వాట్సప్ హ్యాక్.. అధికారులకు ఆ మెసేజ్‌లు
విశాఖపట్నం నగర మున్సిపల్ కమిషనర్ వాట్సాప్ నంబర్‌ను హ్యాక్ చేసి, ఆయన పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ, విశాఖపట్నం : విశాఖపట్నంలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. జీవీఎంసీ కమిషనర్ వాట్సాప్ నంబర్‌ను హ్యాక్ చేసి, ఆయన పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కమిషనర్ ఫొటోను ఉపయోగిస్తూ, అత్యవసరం పేరుతో డబ్బులు పంపించాలని కోరుతూ సందేశాలు పంపుతున్నారు. ఈ విషయం కమిషనర్ దృష్టికి రావడంతో ఆయన అలెర్ట్ అయ్యారు. తాను ఎవరికి డబ్బులు పంపించాలని మెసేజ్ చేయడం లేదని, అలా వచ్చిన మెజేస్‌కు ఎవరూ స్పందించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఫేక్ మెసేజ్‌లకు మోసపోవద్దని అధికారులు, ప్రజలను అలెర్ట్ చేశారు. అనుమానాస్పదంగా వచ్చిన మెసేజ్‌లు, ముఖ్యంగా డబ్బులు అడిగే వాటిపై వెంటనే స్పందించకుండా, సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.
మరోవైపు ఈ ఫేక్ మెసేజ్‌పై కమిషనర్ పోలీసులకు దృష్టి్కి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ నేరస్తులపై నిఘా పెట్టారు. వారు ఎవరు? ఎక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనే కోణం లో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.






