దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం.. తుపాకీతో కాల్చుకుని యువకుడి బలవన్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-10 07:19:30  IST  )

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్‌ వద్ద ఉదయం కాల్పులు కలకలం రేపాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం.. తుపాకీతో కాల్చుకుని యువకుడి బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్‌ వద్ద ఉదయం కాల్పులు కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే.. ఓ 20 ఏళ్ల యువకుడు టీ స్టాల్ వద్ద నాటు తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చుకుని ప్రాణాలు వదిలాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం క్రైమ్ టీమ్, ఢిల్లీ పోలీసులు (Delhi Police) స్పాట్‌కు వచ్చి ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుడు మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)కు చెందిన వాడని, గత కొంతకాలంగా ధర్నాల్లో పాల్గొంటున్నాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అధికారికంగా ఇంకా అతడి ఆచూకీ తెలియరాలేదు. స్పాట్‌లో దొరికిన ఆధారాలు, మొబైల్ ఫోన్ ఆధారంగా యువకుడిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. అసలు సూసైడ్‌కు పాల్పడిన తుపాకీ లైసెన్స్‌డా..? లేక అక్రమగా సంపాదించాడా అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story