నగరంలో గన్‌ మిస్ ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్‌కు గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-24 07:37:44  IST  )

చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నగరంలో గన్‌ మిస్ ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్‌కు గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని అంబర్‌పేట పోలీస్ లైన్ సీపీఎల్ గ్రౌండ్‌లో ఏపీ కేడర్‌కు చెందిన కానిస్టేబుల్ గోవర్దన్ రెడ్డి గార్డు డ్యూటీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు అతడి చేతిలో ఉన్న గన్ ఒక్కసారిగా మిస్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో గోవర్దన్ రెడ్డి (Goverdhan Reddy)కి తీవ్ర గాయాలయ్యాయి. గమనించి తోటి సిబ్బంది అతడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం కేర్ ఆసుపత్రికి (Care Hospital) తరలించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story