- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్ దిశా పటానీ ఇంటిముందు కాల్పుల కలకలం.. చిత్రపరిశ్రమకు వార్నింగ్ ఇస్తూ సంచలన లేఖ
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిముందు కాల్పుల కలకలం చోటు చేసుకుంది. యూపీలోని దిశా ఇంటిముందు దుండగులు ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు కాల్పులు జరపగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిముందు కాల్పుల కలకలం చోటు చేసుకుంది. యూపీలోని దిశా ఇంటిముందు దుండగులు ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు కాల్పులు జరపగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్పులు తామే జరిపామని, దిశా సోదరి ఖుష్బూ సాధువులను అవమానించినందుకే అలా చేశామని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. హిందూ సాధువులు ప్రేమానంద్ మహారాజ్, అనిరుద్దాచార్య మహరాజ్ లను ఖుష్భూ అవమానించారని ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోగా తెల్లవారుజామున అనేక రౌండ్లు కాల్పులు జరిపారని చెప్పారు.
రెండు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఇదిలా ఉంటే రోహిత్ గోదర గోల్డిబ్రార్ అనే వ్యక్తి కాల్పులు తామే జరిపినట్టు సోషల్ మీడియాలో చిత్రపరిశ్రమను హెచ్చరిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. తాను వీరేంద్ర చరణ్, మహేంద్ర శరణ్ (దెలానా)తో కలిసి ఖుష్బూ పటాని ఇంట్లో కాల్పులు జరిపామన్నారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఆమె మాట్లాడిందన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని మరోసారి ఆమె కానీ చిత్రపరిశ్రమలో ఇతరులు కానీ సనాతన ధర్మం గురించి అగౌరవంగా మాట్లాడితే వాళ్ల ఇంట్లో ఎవరూ ప్రాణాలతో ఉండరని హెచ్చరించారు. అంతే కాకుండా మతాన్ని కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళతామని పేర్కొన్నారు.






