- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో కాల్పుల కలకలం.. 12 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు
దేశరాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది.నగరంలోని రోహిణి ప్రాంతంలో 12 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్టు సమాచారం అందుతోంది.

దిశ, వెబ్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. నగరంలోని రోహిణి ప్రాంతంలో 12 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్టు సమాచారం అందుతోంది. పార్కింగ్ స్థలంలో ఆగి ఉన్న కారుపై దుండగులు కాల్పలు జరిపారు. దీంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థంలో డజన్ల కొద్ది బుల్లెట్లను గుర్తించారు. అయితే కాల్పల్లో ఎవరూ గాయపడలేదని ఇప్పటికే స్పష్టం చేశారు. నిందితులు మోటార్ బైక్ పై వచ్చి కాల్పులు జరిపినట్టు స్థానికులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఓ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. తనకు వాట్సాప్ లో ఇంటర్నేషనల్ నంబర్ నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయని అవతల వ్యక్తి బడా గ్యాంగ్ స్టర్ గా పరిచయం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను డబ్బులు ఇవ్వకపోవడంతో బెదిరించడానికే కాల్పులు జరిపాడని తెలిపాడు. బాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. భావు గ్యాంగ్ అనే ఓ గ్యాంగ్ ఈ దాడి చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






