- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలోని ఓ ఇంట్లో తుపాకీ, బుల్లెట్ల కలకలం.. పోలీసుల అదుపులో నిందితుడు
by Kema Shiva Kumar |
భాగ్యనగరంలో నేరాల అదుపునకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పట్టపగలే హత్యలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్స్‌లో ఆగంతకులు రెచ్చిపోతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భాగ్యనగరంలో నేరాల అదుపునకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పట్టపగలే హత్యలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్స్‌లో ఆగంతకులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నగరంలోని మీర్‌పేట్ (Meerpet) పరిధిలోని ఓ ఇంట్లో తుపాకీతో పాటు బుల్లెట్లు లభ్యం అవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చంద్రశేఖర్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద బుల్లెట్‌తో పాటు గంజాయి ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, గత రెండేళ్లుగా చంద్రశేఖర్ (Chandrashekar) మీర్‌పేట్‌లోని SLNS కాలనీలో అద్దెకు ఉంటూ దొంగతనాలే అతడి ప్రవృత్తిగా మార్చుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది.
Next Story






