- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీఎస్టీ ఎగవేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్
by Kema Shiva Kumar |
హైదరాబాద్‌లో రూ.177 కోట్ల భారీ జీఎస్టీ ఎగవేత రాకెట్‌ను డీజీజీఐ అధికారులు ఛేదించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) హైదరాబాద్ కార్యాలయం పేర్కొంది. మొత్తం 66 షెల్ కంపెనీలలో ప్రొప్రైటర్‌షిప్ నిర్వహిస్తూ, సుమారు రూ. 177 కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డ సిద్ధగోని ప్రభాకర్, రామావత్ నాగరాజు నాయక్‌లను బుధవారం అరెస్ట్ చేసినట్లు డీజీజీఐ వెల్లడించింది. విశాఖపట్నం జోనల్ కార్యాలయం చేపట్టిన దాడులలో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.
Next Story






