వేరుశనగ పంటకు నిప్పు

by Dishafeatures2 |
వేరుశనగ పంటకు నిప్పు
X

దిశ, వంగూర్: మండల పరిధిలోని ఉప్పలపహాడ్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి సుమారు 12:30 సమయంలో గ్రామానికి చెందిన రైతు సుంకరి సైదులు గౌడ్ వేరుశనగ పంటకు గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. సుమారు ఆరు ఎకరాల్లో వేసిన పంట పూర్తిగా బూడిదైపోయింది. లక్ష యాబై వేల రూపాయల పైగా పెట్టుబడి పెట్టి పంట పై రావాల్సిన 5 లక్షల మేర ఆస్థి నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ చర్యతో కోలుకోలేని విధంగా నష్టపోయనని ఆయన రోదించాడు. గ్రామస్తులు,బాధితుని వివరాల ప్రకారం గ్రామానికి సమీపంలో రైతు సైదులు గౌడ్ పొలం ఉంది. అర్ధరాత్రి 12:30 సమయంలో కాలకృత్యాల కోసం బయటికి వచ్చిన ఒక వ్యక్తి సైదులు గౌడ్ పొలంలో మంటలు రావడం గమనించాడు. ఈ విషయాన్ని సైదులు గౌడ్ తమ్ముడికి ఫోన్ ద్వారా తెలియజేశాడు.

ఆయన తమ్ముడు సైదులు గౌడ్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి, పొలం వద్దకు వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాలేదు. ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చేలోగా పూర్తిగా పంట కాలి బూడిదైపోయింది. ఉదయం ఐదు గంటలకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అదే విదంగా పొలం పక్క రైతు పై అనుమానంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించి దోషులెవ్వరో తేల్చుతామన్నారు. రైతు సైదులు గౌడ్ కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఎన్నో ఆశలతో సాగుచేసిన పంట పూర్తిగా కాలిపోవడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని సంఘటనకు కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు.


Next Story

Most Viewed