నానమ్మ వివాహేతర సంబంధం.. ఇంట్లో డబ్బు, నగలన్నీ తీసుకుని ప్రియుడితో పరార్

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ మౌరానిపూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కొడుకుల తల్లి.. ఇద్దరు మనవళ్ల నానమ్మ.. ప్రియుడితో పారిపోయింది. ఇంట్లో నగలు, డబ్బు తీసుకుని పరారైంది. దీంతో కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు.

నానమ్మ వివాహేతర సంబంధం.. ఇంట్లో డబ్బు, నగలన్నీ తీసుకుని ప్రియుడితో పరార్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మౌరానిపూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కొడుకుల తల్లి.. ఇద్దరు మనవళ్ల నానమ్మ.. ప్రియుడితో పారిపోయింది. ఇంట్లో నగలు, డబ్బు తీసుకుని పరారైంది. దీంతో కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. ఇంటిని సంరక్షించాల్సిన వ్యక్తి తమ పరువు తీసిందని కన్నీరు పెట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భర్త కాంత ప్రసాద్ రెండేళ్ల క్రితం భిండ్ మోరేనాలోని బ్రిక్ కిల్న్‌లో కూలీ పనికి భార్యను తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెకు బిహుని విలేజ్‌కు చెందిన అమర్ సింగ్ ప్రజాపతితో ఇల్లీగల్ రిలేషన్‌షిప్ ఏర్పడింది. విషయం తెలిసి భర్త వారించినా వినలేదు. ఇక ఇప్పుడు ఏకంగా ఈ నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.

Next Story