- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి గ్లాసులో నిధుల వేట: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ. 3.89 కోట్ల బంగారం సీజ్
ముంబై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు నూతన సంవత్సర వేడుకల వేళ అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ముంబై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు నూతన సంవత్సర వేడుకల వేళ అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. 2025 డిసెంబర్ 31న బహ్రెయిన్ నుండి ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఒక భారతీయ ప్రయాణికుడిని పక్కా సమాచారంతో అధికారులు అడ్డుకున్నారు. అతని సామాగ్రిని క్షుణ్ణంగా తనిఖీలు చేయగా, ఒక వాటర్ టంబ్లర్ (నీటి గ్లాసు) లోపల అత్యంత తెలివిగా దాచి ఉంచిన 12 క్యాప్సూల్స్‌ను గుర్తించారు. ఈ క్యాప్సూల్స్‌లో మైనం రూపంలో ఉన్న సుమారు 3.05 కిలోల మేర బంగారం పొడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ 24 క్యారెట్ల బంగారం విలువ సుమారు రూ. 3.89 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అనంతరం కస్టమ్స్ చట్టం, 1962లోని సంబంధిత నిబంధనల ప్రకారం ఈ బంగారాన్ని సీజ్ చేసి, నిందితుడిని అరెస్టు చేసినట్లు ముంబై డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. అలాగే దీనిపై యువకుడిని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.






