Gold Seize: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. భారీగా బంగారం సీజ్

by Kema Shiva Kumar |

దేశ వ్యాప్తంగా బంగారం (Gold) ధరలు ఆకాశాన్నంటుతోన్న వేళ గోల్డ్ అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Gold Seize: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. భారీగా బంగారం సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా బంగారం (Gold) ధరలు ఆకాశాన్నంటుతోన్న వేళ గోల్డ్ అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా విదేశాల నుంచి దొంగచాటుగా బంగారం తీసుకొస్తే స్పెషల్ డ్రైవ్‌ (Special Drives)లు నిర్వహించి ఉక్కుపాదం మోపాలని సెంట్రల్ ఇంటెలిజెన్స్ (Central Intelligence), కస్టమ్స్ అధికారుల (Customs Officials)కు సూచించింది. ఈ క్రమంలోనే ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులు (Airports), ఓడరేవు (Ports)ల్లో కస్టమ్స్ అధికారులు (Customs officials) అధికారులు నిత్యం జల్లెడ పడుతున్నారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను క్లియర్‌గా చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కస్టమ్స్ అధికారులు ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport)లో తనిఖీలు నిర్వహించారు. అయితే, ఖర్జూర పండ్ల (Date Fruit) ముసుగులో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న కేటుగాడిని అదుపులోకి తీసున్నారు. బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఖర్జూరం పండ్లలో మిక్స్ చేశాడు. అనుమానం వచ్చిన సిబ్బంది మెటల్ డిటెక్టర్‌ (Metal Detector)తో ఖర్జూర పండ్లను చెక్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి సుమారు 172 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

Next Story