- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్లో బంగారం మాయం.. ఇంటి దొంగల పనేనా?
by Naga Rani Yarlagadda |
ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసుల దగ్గరికి వెళ్తాం. మరి పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగితే ఏం చేస్తారు?

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసుల దగ్గరికి వెళ్తాం. మరి పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగితే ఏం చేస్తారు? వాళెల్క్కడికి వెళ్తారు? తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్ స్టేషన్లో 150 గ్రాముల బంగారం మాయమైంది. ఓ వ్యాపారి హత్య సమయంలో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లోనే భద్రపరిచారు. తాజాగా మరో కేసులో వస్తువుల్ని భద్రపరుస్తున్న క్రమంలో.. బంగారం పోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడున్న రేటు ప్రకారం మాయమైన బంగారం విలువ సుమారు రూ.23 లక్షల విలువ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నత అధికారులు స్టేషన్ పోలీసుల్ని రహస్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. బయటి వ్యక్తులు లాకర్ వరకూ వెళ్లే అవకాశం తక్కువగా ఉండటంతో.. ఇది ఇంటిదొంగల పనేనా ? అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story






