- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాస్పిటల్ లో డబ్బులు ఇచ్చేందుకు వెళ్తూ అనంత లోకాలకు
కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర బండపాలెంస్టేజి వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

దిశ, కోదాడ : కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర బండపాలెంస్టేజి వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర బండపాలెం సుందరయ్య కాలనీ చెందిన దుద్దుకూరి ఎల్లయ్య అలియాస్ వెంకట్ (25) తన బైక్‌పై కోదాడ వైపు వెళ్తుండగా.. ఎదురుగా వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఢీ ప్రభావం తీవ్రంగా ఉండటంతో వెంకట్ రోడ్డు పై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో తమ్మర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






