- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవుడి దీపమే మరణ శాసనం..!
దేవుడి దీపమే ఆమెకు మరణ శాసనం అయింది. చీరకు నిప్పంటుకొని రిటైర్డ్ ప్రిన్సిపాల్ అగ్నికి ఆహుతి అయింది.

దిశ, బేగంపేట : దేవుడి దీపమే ఆమెకు మరణ శాసనం అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామ్ లాల్ బిల్డింగ్ సమీపంలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి విజయలక్ష్మి అనే రిటైర్డ్ ప్రిన్సిపల్ మృతి చెందింది. శుక్రవారం ఇంట్లో పై అంతస్తులో నివాసం ఉంటున్న విజయలక్ష్మి ఇంట్లో దేవుడికి దీపం వెలిగిస్తున్న క్రమంలో చీర కొంగుకు అకస్మాత్తుగా నిప్పంటుకుంది. చీరకు నిప్పంటుకున్న వెంటనే భయాందోళనకు గురైన విజయలక్ష్మి బెడ్ రూమ్ లోకి వెళ్లగా ఆ మంటలు దుప్పటికి అంటుకోవడంతో మంటలు తీవ్రత మరింత పెరిగింది. దీంతో ఆమె ఒళ్ళంతా మంటలు అంటుకొని తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అదే ఇంట్లో రెండో అంతస్తులో తన కూతురు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.పాఠశాల ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయిన విజయలక్ష్మి ఇంట్లోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో ఆమె పూజ చేస్తుందని ఆమె కూతురు తెలిపారు. అకస్మాత్తుగా దేవుడికి వెలిగించిన దీపం ఆమె చీరకు అంటుకొని మంటలు చెలరేగడంతో శరీర భాగాలు కాలిపోయి మృతి చెందినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






