- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దైవ దర్శనానికి వెళ్లి మృత్యు ఒడిలోకి
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి దైవ దర్శనం కు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కొమురవెల్లిలో శనివారం చోటుచేసుకుంది.

దిశ, కొమురవెల్లి : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి దైవ దర్శనం కు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కొమురవెల్లిలో శనివారం చోటుచేసుకుంది. కొమురవెల్లి ఎస్సై చెంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు మండలం, పోచారం గ్రామానికి చెందిన సంకెపల్లి జంగయ్య (62) శనివారం కుటుంబ సమేతంగా మల్లికార్జున స్వామి దర్శనానికి కొమురవెల్లికి వచ్చి అద్దె గది తీసుకున్నారు. జంగయ్య ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులతో దర్శనానికి వెళ్లకుండా గదిలోనే ఉండిపోయాడు.
దర్శనానికి వెళ్లి వచ్చిన కుటుంబ సభ్యులకు జంగయ్య గదిలో కనిపించకపోవడంతో రాత్రి అంతా వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం కొమురవెల్లి గ్రామానికి చెందిన యాదగిరి తమ పొలం పనుల నిమిత్తం వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లగా తన పొలంలో పడి ఉన్న మృతదేహాన్ని చూసి గ్రామస్థులు, పోలీసులకు సమాచారం సమాచారం అందజేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి మృతుడు జంగయ్య కుమారుడు రాజ్ కుమార్ వాగ్మూలం మేరకు మృతదేహాన్ని చేర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.






