గంజాయి అమ్ముతున్న ఇద్దరు అమ్మాయిలు అరెస్ట్.. రైల్వే స్టేషన్‌లోనే..

by Sujitha Rachapalli |

కేరళ కొచ్చిలోని ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులు అరెస్టయ్యారు. వారి దగ్గర సుమారు 37 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారి బ్యాగుల నిండా గంజాయి ఉండగా..

గంజాయి అమ్ముతున్న ఇద్దరు అమ్మాయిలు అరెస్ట్.. రైల్వే స్టేషన్‌లోనే..
X

దిశ, వెబ్‌డెస్క్ : కేరళ కొచ్చిలోని ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులు అరెస్టయ్యారు. వారి దగ్గర సుమారు 37 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారి బ్యాగుల నిండా గంజాయి ఉండగా.. కిలోగ్రాముకు రూ.25వేల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒడిశా నుంచి గంజాయి సేకరించి.. ఇక్కడకు తీసుకొస్తున్నట్లు సమాచారం. కాగా ఇద్దరు అమ్మాయిలు ఇంత పెద్ద మొత్తంలో బ్యాగుల్లో గంజాయి తీసుకొచ్చి అమ్మడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారికి డెత్ పెనాల్టీ ఉండాలంటున్నారు. అయితే వీరిద్దరు స్టూడెంట్స్ కావడంపై మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఇంత దారుణంగా మారిపోతున్నారని బాధపడుతున్నారు.

VIDEO

Next Story