- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో అమానవీయ ఘటన.. బాలికపై తండ్రి, మేనమామ అత్యాచారం
by Ajay Maddhiboyina |
ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై కన్నతండ్రి, మేనమామ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై కన్నతండ్రి, మేనమామ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కదిరి నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక అనారోగ్యంతో బాధపడుతుండగా ఉపాధ్యాయురాలికి అనుమానం వచ్చింది. బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించగా ప్రెగ్నెన్సీ విషయం బయటపడింది. టీచర్ బాలికను ప్రశ్నించడంతో సెలవులకు ఇంటికి వెళ్లిన సమయంలో తండ్రి, మేనమామ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు చెప్పింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై జిల్లా అధికారి విచారణ జరిపినట్టు సమాచారం.
Next Story






