స్నేహితులతో కలిసి తమ ఇంట్లోనే చోరీ చేసిన యువతి.. బ్యాచ్ మొత్తం అరెస్ట్

by Ajay Maddhiboyina |

ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అనే ఓ సామెత ఉంది. తాను కూడా అలానే పట్టుబడకుండా ఉంటానని అనుకుందో ఏమో కానీ ఓ ముద్దుల కుమార్తె సొంత ఇంటికే కన్నం వేసింది.

స్నేహితులతో కలిసి తమ ఇంట్లోనే చోరీ చేసిన యువతి.. బ్యాచ్ మొత్తం అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అనే ఓ సామెత ఉంది. తాను కూడా అలానే పట్టుబడకుండా ఉంటానని అనుకుందో ఏమో కానీ ఓ ముద్దుల కుమార్తె సొంత ఇంటికే కన్నం వేసింది. స్నేహితులతో కలిసి ఇళ్లును గుళ్ల చేసింది. చివరికి ఆమె ఊహించింది బెడిసికొట్టి పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్ బరేలిలో చోటు చేసుకుంది. సోనాలి అనే యువతి తన స్నేహితులతో కలిసి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బును దొంగతనం చేసింది.

ఇంట్లో ఎవ‌రూలేని స‌మ‌యం చూసి సోనాలి చోరీ చేయ‌గా త‌ర‌వాత ఇంటికి వ‌చ్చిన తల్లి దండ్రులు చూసి షాక్ అయ్యారు. వెంట‌నే పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టారు. కూతురు సోనాలి ప్ర‌వ‌ర్త‌న‌లో తేడా క‌నిపించ‌డంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించ‌గా త‌డ‌బ‌డ‌టంతో అనుమానం వ‌చ్చింది. దీంతో పోలీసులు త‌మ స్టైల్ లో విచార‌ణ జ‌ర‌ప‌గా అస‌లు నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అనంత‌రం సోనాలితో పాటు ఆమెకు స‌హ‌క‌రించిన స్నేహితుల‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేసి వారి వ‌ద్ద నుండి దొంగ‌లించిన బంగారం, డ‌బ్బును స్వాధీనం చేసుకున్నారు.

Next Story