- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చదువులో వెనకపడ్డావంటూ అవమానించిన ఫ్రెండ్స్.. విద్యార్థిని ఆత్మహత్య
స్నేహితులు అంటే కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు. కష్టం వచ్చినప్పుడు వెన్నుతట్టి ముందుకు నడిపిస్తారు. కానీ అలాంటి స్నేహితులే అవమానిస్తే ఎవరికి చెప్పుకోలేక ఏం చేయాలో తెలియక కుమిలిపోతారు.

దిశ, వెబ్ డెస్క్: స్నేహితులు అంటే కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు. కష్టం వచ్చినప్పుడు వెన్నుతట్టి ముందుకు నడిపిస్తారు. కానీ అలాంటి స్నేహితులే అవమానిస్తే ఎవరికి చెప్పుకోలేక ఏం చేయాలో తెలియక కుమిలిపోతారు. అలాంటి పరిస్థితిలోనే ఓ యువతి అత్మహత్య చేసుకుంది. చదువులో వెనకబడ్డావు అంటూ స్నేహితులు అవమానించడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో చోటు చేసుకుంది. నిత్య 21 అనే విద్యార్థిని హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలోని హాస్టల్‌లో ఉంటూ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. కాగా ఆమె స్నేహితులు వైష్ణవి, సంజన చదువుల్లో వెనకపడ్డావు అని అవమానించడంతో తట్టుకోలే ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 2న నిత్య తన సొంతూరుకు రాగా గడ్డిమందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నిన్న కన్నుమూసింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంజన, వైష్ణవిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






