AP: ఇంట్లో పేలిన వంట గ్యాస్ సిలిండర్‌..నగదు, బంగారం అగ్నికి ఆహుతి

by velandi.Saikiran |

ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది.

AP: ఇంట్లో పేలిన వంట గ్యాస్ సిలిండర్‌..నగదు, బంగారం అగ్నికి ఆహుతి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో పెను విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దీంతో బీరువాలో ఉన్న నగదు, బంగారం అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆలూరు లోని హత్తిబెళగల్‌ రోడ్డు సమీపంలో ఉన్న ఓ ఇంట్లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆలూరుకు చెందిన చాంద్ బాషా, షాహిదా దంపతులు ఉంటున్న ఇంట్లో రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఈ క్రమంలోనే చూస్తుండగానే గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.

రూ.3 ల‌క్ష‌ల న‌గ‌దు, తులం బంగారం అగ్నికి ఆహుతి

అయితే ఆ సమయంలో చాంద్ బాషా ఇంట్లో లేకపోగా, షాహిదా మాత్రం వెంటనే అలర్ అయింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఆమె వచ్చిన 30 సెకండ్ల వ్యవధిలోనే సిలిండర్ బ్లాస్ట్ అయింది. దీంతో ప్రాణా పాయం జరగలేదు. అయితే ఇంట్లో బీరువాలో ఉంచిన మూడు లక్షల నగదుతో పాటు తులం బంగారం అగ్నికి ఆహుతి అయ్యాయి. ఖరీదైన వస్తువులు కూడా పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో షాహిదాకు చిన్నపాటి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక అధికారులు మంటలు ఆదుపు చేశారు.

Next Story