నగరంలో పేలిన గ్యాస్ సలిండర్.. ఏడుగురిని కాపాడిన పోలీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-20 09:11:54  IST  )

నగరం నడిబొడ్డున గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన నల్లకుంట (Nallakunta) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నగరం నడిబొడ్డున గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన నల్లకుంట (Nallakunta) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నగరంలో పేలిన గ్యాస్ సలిండర్.. ఏడుగురిని కాపాడిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: నగరం నడిబొడ్డున గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన నల్లకుంట (Nallakunta) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం వడ్డేర బస్తీ (Vaddera Basti)లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ క్రమంలోనే మొదటి అంతస్తులో చిక్కుకుపోయిన ఏడుగురిని పోలీసులు చాకచక్యంగా రక్షించారు. గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్పాండ్ అయి ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టిన ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులను స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.

Next Story