- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైలార్ దేవుపల్లిలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇల్లు ధ్వంసం
by Taduka Kalyani |
వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికీ పెను ప్రమాదం తప్పిన ఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, శంషాబాద్: వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికీ పెను ప్రమాదం తప్పిన ఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రానికి చెందిన రవిరంజన్ కుమార్, భార్య అస్మర్తి కుమారి, ఆయుష్ రాజ్ (6) ముగ్గురు బతుకుదెరువు కోసం వచ్చి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి డివిజన్ దుర్గానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని ప్రైవేట్ పని చేసుకుంటూ జీవిస్తున్నారు.
బుధవారం అస్మర్తి కుమారి గ్యాస్ పొయ్యిపై వంటలు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ కు మంటలు అంటుకోవడంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఇంట్లో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






