- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి రవాణా ముఠా అరెస్ట్.. టాస్క్ ఫోర్స్ నిర్బంధంతో కోలుకోలేని దెబ్బ
జమ్మికుంట పట్టణ శివారులోని ఎఫ్‌సీఐ సమీపంలో మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని, స్థానిక పోలీసులకు అప్పగించారు.

X
దిశ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణ శివారులోని ఎఫ్‌సీఐ సమీపంలో మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని, స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు ప్రాంతం నుంచి తీసుకువచ్చిన 15 కిలోల గంజాయిని కరీంనగర్‌కు రవాణా చేస్తుండగా, టాస్క్ ఫోర్స్ పోలీసులకు ప్రత్యేకంగా అందిన సమాచారంతో ఈ ఆపరేషన్ జరిగింది. ముందస్తుగా నిఘా పెట్టిన అధికారులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
జమ్మికుంట పరిధిలో గంజాయి అక్రమ రవాణా, సరఫరా గత కొంత కాలంగా ఊహించని రీతిలో పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడితో గంజాయి ముఠాకు గట్టి దెబ్బ తగిలినట్లైంది. అదుపులో ఉన్న నలుగురు వ్యక్తుల నుంచి విచారణ చేపట్టిన పోలీసులు త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
Next Story






