- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తక్కువలో కొనొచ్చు.. ఎక్కువలో అమ్మొచ్చు..! మత్తు వ్యాపారంలో మహారాష్ట్ర లింక్..!
by Bhanu |
తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి నగరంలో అధిక ధరలకు విక్రయిస్తూ డబ్బు సంపాదించాలని చూస్తూ చివరకు చందానగర్ పోలీసుల చేతికి చిక్కారు ఇద్దరు యువకులు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి నగరంలో అధిక ధరలకు విక్రయిస్తూ డబ్బు సంపాదించాలని చూస్తూ చివరకు చందానగర్ పోలీసుల చేతికి చిక్కారు ఇద్దరు యువకులు. శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉండే హరినాథ్ (24), శివాజీ (25)లు మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, నగరంలోని మత్తుకు బానిసలైన యువతను టార్గెట్ చేసి అధిక ధరలకు విక్రయిస్తూ మాదక ద్రవ్యాల సరఫరాలో దూకుడు చూపారు.
ఈ సమాచారాన్ని ముందుగానే అందుకున్న చందానగర్ పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 1.2 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హరినాథ్, శివాజీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Next Story






