- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ganja Seize: పోలీసుల విస్తృత తనిఖీలు.. 300 కిలోల గంజాయి సీజ్
నగరంలోనే కాకుండా పల్లెల్లో కూడా గంజాయి కల్చర్ జోరుగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోనే కాకుండా పల్లెల్లో కూడా గంజాయి కల్చర్ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ (Drugs) వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు సర్కార్ పక్కా ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు డ్రగ్స్, గంజాయి విక్రయిస్తూ.. ఎవరైనా పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department)కు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు (Airports)లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ.. ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే విశాఖపట్నం (Vishakhapatnam) నుంచి హైదరాబాద్ (Hyderabad)కు గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు.. మహేశ్వరం ఎస్‌వోటీ (Maheshwaram SOT), అబ్దుల్లాపూర్ మెట్ (Abdullapur Met) పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, తనిఖీల్లో భాగంగా ఓ కంటైనర్‌లో తరలిస్తున్న 300 కిలోల గంజాయి సీజ్ చేశారు. అదేవిధంగా కంటైనర్ (Container)తో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.






