ganja ice creams: హోలీ ముసుగులో గంజాయి దందా.. ఈ సారి ఏకంగా గంజాయి ఐస్ క్రీమ్ లు..

by Prasad Jukanti |

హైదరాబాద్ లో గంజాయి ఐస్ క్రీమ్ లు కలకలం రేపాయి.

ganja  ice creams: హోలీ ముసుగులో గంజాయి దందా.. ఈ సారి ఏకంగా గంజాయి ఐస్ క్రీమ్ లు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: మత్తుపదార్థాల విక్రయాలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం ఎంత ప్రయత్నిస్తున్నా కేటుగాళ్లు కొత్త పద్దతుల్లో మత్తు దందాలకు తెరలేపుతున్నారు. నిన్నా మొన్నటి వరకు గంజాయి చాక్లెట్లతో మార్కెట్లోకి మత్తును చిమ్మగా తాజాగా గంజాయితో తయారు చేసిన ఐస్ క్రీమ్ లు (Ganja Ice Cream) కలకలం రేపాయి. ధూల్ పేట్ లోని (Dhool Pate) మల్చిపురాలో గంజాయితో కుల్ఫీ ఐస్ క్రీమ్ (Ganja Kulfi) తయారు చేసి అమ్ముతున్న వ్యక్తిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి గంజాయి మిక్స్ చేసి అమ్ముతున్న కుల్ఫీలను స్వాధీనం చేసుకున్నారు. హోలీ సంబరాల ముసుగులో అతడు గంజాయి దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే కుల్ఫీ ఐస్ క్రీమ్ లను గంజాయి మత్తును కలపడం అందరిని ఆందోళన కలిగిస్తోంది.

Next Story