గంజాయి చాక్లెట్లు, గుట్కా ప్యాకెట్ల పట్టివేత

by Bhanu |

హయత్​నగర్ ​పోలీసులు, ఎల్బీనగర్​ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్ ​పరిధిలోని శుభోదయ కాలనీలో గంజాయి చాక్లెట్లు, వివిధ రకాల నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు.

గంజాయి చాక్లెట్లు, గుట్కా ప్యాకెట్ల పట్టివేత
X

దిశ, వనస్థలిపురం: హయత్​నగర్ ​పోలీసులు, ఎల్బీనగర్​ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్ ​పరిధిలోని శుభోదయ కాలనీలో గంజాయి చాక్లెట్లు, వివిధ రకాల నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు. హయత్​నగర్​సీఐ నాగరాజు గౌడ్​ వివరాల ప్రకారం.. కుంట్లూర్ రోడ్‌లోని శుభోదయ కాలనీ.. దుర్గా భవానీ ట్రేడర్స్ లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గంజాయి చాక్లెట్‌లను నిల్వ చేసి విక్రయిస్తున్నారని ఎస్వోటీ పోలీసులు సమాచారం వచ్చింది.

వెంటనే వారు హయత్​నగర్​ఎస్సై వెంకట్​రెడ్డికి సమాచారం ఇవ్వడంతో, ఎస్సై సిబ్బందితో వెళ్లి దుకాణంలో సోదాలు నిర్వహించారు. యాదాద్రి జిల్లా పుట్టపాకకు చెందిన షాప్ యజమాని గుండు శేఖర్ ను, ఆయనకు గంజాయి చాక్లెట్లు విక్రయించడానికి వచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ఆరెగూడెంకు చెందిన రిషి శంకర్ మిశ్రా అలియాస్​గుడ్డు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ‘ సెవెన్​మినార్ వట్టి’ అని లేబుల్ చేయబడిన 9 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు, చార్మినార్ గోల్డ్ మునక్క’ అని లేబుల్ చేయబడిన మరొక ప్యాకెట్ దొరికాయి.


మొత్తం 10 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు సుమారు. 2.035 కిలోల బరువు ఉన్నాయి. వివిధ నిషేధిత పొగాకు ఉత్పత్తులను రూ. 40 వేల విలువగల ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై వెంకట్​రెడ్డి కంప్లైంట్​మేరకు సీఐ నాగరాజు గౌడ్ వారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్​డీపీఎస్​) చట్టం కింద కేసు నమోదు చేసి , దర్యాప్తు కోసం సెక్టార్​ఎస్సై లక్ష్మీనారాయణకు అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజు గౌడ్​మాట్లాడుతూ.. హయత్‌నగర్ ప్రజలు ఇలాంటి డ్రగ్స్​, గంజాయి ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలుసుకోవాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Next Story