గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌కి 11 రోజుల రిమాండ్

by Kema Shiva Kumar |

అంతర్జాతీయ కాంట్రాక్ట్ కిల్లింగ్స్, ఆయుధ స్మగ్లింగ్‌కు పేరుగాంచిన గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ (Anmol Bishnoi)కు పాటియాలా కోర్టు (Patiala Court) 11 రోజుల పోలీస్ రిమాండ్ విధించింది.

గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌కి 11 రోజుల రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ కాంట్రాక్ట్ కిల్లింగ్స్, ఆయుధ స్మగ్లింగ్‌కు పేరుగాంచిన గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ (Anmol Bishnoi)కు పాటియాలా కోర్టు (Patiala Court) 11 రోజుల పోలీస్ రిమాండ్ విధించింది. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడైన అన్మోల్‌ను అమెరికా అధికారులు మంగళవారం డిపోర్ట్ చేసి స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. దీంతో అతడు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే ఎన్‌ఐఏ (NIA) అధికారులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం సాయంత్రం ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరచగా.. అన్మోల్ బిష్ణోయ్‌ని న్యాయమూర్తి 11 రోజుల పోలీస్ రిమాండ్ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story