- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్.. ఆపై టెర్రస్ నుంచి తోసేసి..
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం వెలుగుచూసింది. బులంద్ షహర్లో 6ఏళ్ల బాలికపై లైంగికదాడి చేసి.. టెర్రస్ పై నుంచి తోసి చంపేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆడపిల్లల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. అవి పూర్తిస్థాయిలో రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. నేరాలకు నెలవుగా చెప్పుకునే ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం వెలుగుచూసింది. బులంద్ షహర్ లో ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి.. ఆపై బాలికను టెర్రస్ పై నుంచి తోసేసి చంపేశారు. జనవరి 2వ తేదీ సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్ని గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేసేందుకు ఆ ప్రాంతంలో మోహరించగా.. పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరి కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. బాలిక బ్రతికి ఉంటే తమ గుర్తింపు బయటపడుతుందని ఇంటిపై నుంచి తోసి చంపేసినట్లు రాజు, వీరూ కశ్యప్ లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
రాజు, వీరూ కశ్యప్ లు తమ ఇంటిపైనే అద్దెకు ఉన్నారని బాలిక తండ్రి తెలిపారు. రాజు బలరాంపూర్ కు చెందినవాడు కాగా.. వీరూ లఖింపూర్ నుంచి వచ్చినట్లు చెప్పారు. తమ కూతురు ఇంటిపైన ఆడుకుంటున్న సమయంలో.. ఆమెపై లైంగిక దాడి చేసి.. భవనం నుంచి పొలంలోకి తోసేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై పోక్సో, బీఎన్ఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.






