- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజస్థాన్‌లో దారుణం.. కదిలే కారులో ఐటీ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్
రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. కదిలే కారులో ఐటీ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. కంపెనీ సీఈవో, మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త ఈ దారుణానికి పాల్పడటం కలకలం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. కదిలే కారులో ఐటీ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. కంపెనీ సీఈవో, మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త ఈ దారుణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. ఉదయ్‌పూర్ ప్రాంతంలో తన పుట్టినరోజు మరియు న్యూ ఇయర్ సందర్భంగా జేకేఎం అనే ఐటీ సంస్థ సీఈఓ జితేష్ సిసోడియా ఒక హోటల్లో విందు ఏర్పాటు చేశారు. విందు ముగిసిన అనంతరం పార్టీకి వచ్చిన మత్తులో ఉన్న ఉద్యోగిని ఇంటిదగ్గర దిగబెడతామని కారు ఎక్కించుకున్నారు. కారులో మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ శిల్పా సిరోహి కూడా ఉండడంతో ఉద్యోగిని ధైర్యంగా కారు ఎక్కారు.
కాగా మార్గమధ్యంలో కారు ఆపి స్మోకింగ్ చేసే పదార్థాలను కొనుగోలు చేసి మహిళా ఉద్యోగినికి కూడా పొగ తాగించగా, ఆమె పూర్తిగా మత్తులోకి జారుకున్నారు. అనంతరం సీఈఓ జితేష్, మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త గౌరవ్ కదిలే కారులో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. స్పృహాలోకి వచ్చి తనపై లైంగిక దాడి జరిగిందని గ్రహించిన ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు వెబ్ క్యామ్‌లో రికార్డయిన దృశ్యాల మేరకు దాడి జరిగిందని నిర్ధారించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






