ఆగ్రాలో దారుణం.. బిచ్చమెత్తుకుంటున్న బాలికపై గ్యాంగ్ రేప్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Sujitha Rachapalli |

క్రైమ్ రేట్ పెరుగుతోంది. ముఖ్యంగా అమ్మాయిలపై అత్యాచారాల సంఘటనలు దారుణంగా పెరిగిపోతున్నాయి. పది నిమిషాలకో రేప్ జరుగుతుందని ఓ అధ్యయనం ఇటీవలే వెల్లడించింది కూడా. పసిపిల్లలు, టీనేజర్స్, వృద్ధులు అనే తేడా లేకుండా తమ కామానికి బలి చేస్తున్నారు

ఆగ్రాలో దారుణం.. బిచ్చమెత్తుకుంటున్న బాలికపై గ్యాంగ్ రేప్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : క్రైమ్ రేట్ పెరుగుతోంది. ముఖ్యంగా అమ్మాయిలపై అత్యాచారాల సంఘటనలు దారుణంగా పెరిగిపోతున్నాయి. పది నిమిషాలకో రేప్ జరుగుతుందని ఓ అధ్యయనం ఇటీవలే వెల్లడించింది కూడా. పసిపిల్లలు, టీనేజర్స్, వృద్ధులు అనే తేడా లేకుండా తమ కామానికి బలి చేస్తున్నారు మానవ మృగాలు. ఆగ్రాలో ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. రోడ్లపై బిచ్చమెత్తుకునే బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. అడుక్కుంటున్న అమ్మాయిని ఎత్తుకెళ్లిన ఇద్దరు యువకులు సంజయ్ క్యాంపస్ ప్యాలెస్‌లో అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ దృశ్యాన్ని వీడియో తీసిన ఇద్దరు.. దాన్ని ఇతరులకు షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్లిపింగ్ పోలీసుల వరకు చేరడంతో.. స్వయంగా సమాచారం తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందుతులు జునైది, ఆసిఫ్‌గా గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story