భర్తను మంచానికి కట్టేసి ఆయన ఎదుటే.. భార్య, కూతురిపై గ్యాంగ్ రేప్

by Disha Web Desk 4 |
భర్తను మంచానికి కట్టేసి ఆయన ఎదుటే.. భార్య, కూతురిపై గ్యాంగ్ రేప్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకున్నది. ఓ మహిళ, ఆమె కూతురు(మైనర్)పై దుండగులు లైంగికదాడికి తెగబడ్డారు. భర్తను మంచానికి కట్టేసి అతడి కళ్ల ముందే ఈ లైంగిక దాడి చేయడం గమనార్హం. యూపీలోని రామ్‌పూర్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తొలుత దొంగతనం కేసు పెట్టిన బాధితులు.. ఆ తర్వాత విచారణలో జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించారు.

దొంగతనానికి వచ్చిన నిందితులే ఈ ఘతుకానికి పాల్పడ్డట్టు బాధితులు ఆరోపించారు. తొలుత బాధితులు తమ ఇంట్లో చోరీ జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు. రూ. 5 వేలు, మొబైల్ ఫోన్ పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ మొదలుపెట్టగా.. లైంగిక దాడికి పాల్పడ్డట్టు బాధితులు చెప్పారు. మెకానిక్‌గా పనిచేస్తున్న వ్యక్తి భార్యపై, అతడి కూతురిపై దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది.

Next Story

Most Viewed