యువతిపై సామూహిక అత్యాచారం.. హత్య..?

by Ratna Kumari |   (  Updated:2025-12-18 09:19:04  IST  )

దిశ, మూసాపేట: మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

యువతిపై సామూహిక అత్యాచారం.. హత్య..?
X

దిశ, మూసాపేట : మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో దారుణం జరిగింది. బుధవారం రాత్రి సర్పంచ్‌ ఎన్నికల విజయోత్సవాలు ఒకవైపు జరుగుతుండగా.. మరొకవైపు 22 సంవత్సరాల యువతిని రైతు వేదిక వద్దకు ఆమెకు పరిచయం ఉన్న యువకుడు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతి కి మత్తు ఇచ్చి అత్యాచారానికి పాల్పడడం వల్లనో.. ఇతర కారణాల వల్లనో ఆ యువతికి రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆ యువకుడు ఆ యువతి కుటుంబ సభ్యురాలుకు మీ అమ్మాయి ఎన్నికల విజయోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సౌండ్ తో రైతు వేదిక వద్ద కుప్ప కూలిపోయింది అని సమాచారం ఇచ్చాడు. మృతురాలు కుటుంబ సభ్యురాలు, యువకుడు సంఘటన స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్థానికంగా ఉన్న ఆర్ఎంపి డాక్టర్ వద్ద కు తీసుకువెళ్లగా.. పరిస్థితి అప్పటికే విషమించిపోయింది అని తెలిపి.. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమన్నాడు. వెంటనే వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీక‌రించారు. యువతి మృత‌ దేహాన్ని తిరిగి రైతు వేదిక వద్ద ఉంచారు. ఉదయానికి సమాచారం తెలియడంతో పలువురు అక్కడకు వెళ్లి చూడగా.. సంఘటన స్థలంలో ఉన్న ఆనవాళ్లు, రక్తస్రావం అయిన దుస్తుల ను గుర్తించారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు ధృవీకరణ కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకరి కన్నా ఎక్కువ మంది అత్యాచారానికి ఒడిగట్టడం వల్ల మృతి చెందిందా..? లేక మత్తు పదార్థం ఇవ్వడం వల్ల దారుణం జరిగిందా..? అనే విషయాలపై డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్సై వేణు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వివరాలను సేకరిస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు.

Next Story