- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోల్ కతాలో మరో దారుణం.. బర్త్ డే సెలబ్రేట్ చేస్తామని పిలిచి అత్యాచారం!
బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తామని పిలిచి ఓ యువతిపై ఇద్దరు స్నేహితులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన కోల్ కతాలో చోటు చేసుకుంది. హరిదేవ్‌పూర్‌కు చెందిన ఓ యువతిని ఆమె బర్త్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ చేస్తామని చందన్ మల్లిక్, దీప్ బిశ్వాస్ అనే ఇద్దరు ఫ్లాట్‌కు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తామని పిలిచి ఓ యువతిపై ఇద్దరు స్నేహితులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన కోల్ కతాలో చోటు చేసుకుంది. హరిదేవ్‌పూర్‌కు చెందిన ఓ యువతిని ఆమె బర్త్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ చేస్తామని చందన్ మల్లిక్, దీప్ బిశ్వాస్ అనే ఇద్దరు ఫ్లాట్‌కు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారు. గత నెల ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాదితురాలికి కొన్ని నెలల క్రితం చందన్ మల్లిక్ తో పరిచయం ఏర్పడింది.
అతడు కోల్ కతా పూజ కమిటీ ప్రెసిడెంట్ గా పరిచయం చేసుకుని తరవాత ఆమెను దీప్ కు పరిచయం చేశాడు. తరవాత ముగ్గురూ తరచూ మాట్లాడుకోవడంతో స్నేహం ఏర్పడింది. కాగా గత నెల యువతి పుట్టిన రోజు సందర్భంగా చందన్ మల్లిక్, దీప్ ఫ్లాట్ కు పిలిచి ఆమెను చంపేస్తామని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితులు పిలిచారని నమ్మి వెళ్లగా బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశారు.
యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే కలకత్తాలో 24ఏళ్ల లా విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు, సెక్యురిటీ సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే మరో అత్యాచార ఘటన చోటు చేసుకోవడంతో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






