ఢిల్లీలో మహిళపై గ్యాంగ్ రేప్.. వెలుగులోకి సంచలన విషయాలు

by Ajay Maddhiboyina |

దేశ‌రాజ‌ధాని ఢిల్లీ స‌మీపంలోని ఫ‌రిదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. 26ఏళ్ల మహిళపై కదులుతున్న వ్యాన్‌లో అత్యాచారం జరిగింది.

ఢిల్లీలో మహిళపై గ్యాంగ్ రేప్.. వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశ‌రాజ‌ధాని ఢిల్లీ స‌మీపంలోని ఫ‌రిదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. 26ఏళ్ల మహిళపై కదులుతున్న వ్యాన్‌లో అత్యాచారం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే మహిళకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉండగా భర్తతో గొడవల కారణంగా తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. డిసెంబర్ 30న రాత్రి ఇంట్లో తల్లితో గొడవ జరగ్గా స్నేహితురాలి ఇంటికి వెళతానని రెండు మూడు గంటల్లో తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోయింది. స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తున్న సమయంలో వాహనాలు రాకపోవడంతో ఓ చిన్నవ్యాన్ లో లిఫ్ట్ అడగ్గా ఎక్కించుకుని ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు.

వ్యాన్‌ను నగరంలోని మారుమూల ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. మహిళ ఖండించడంతో ఆమెను తీవ్రంగా హింసించారు. అత్యాచారం చేసిన అనంతరం ఆమెను రోడ్డు పక్కన పడేసి అక్కడ నుండి పారిపోయారు. మహిళ తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతుండగా ఆమెకు తీవ్రగాయాలు అయినట్టు వైద్యులు నిర్దారించారు. ఆమె శరీరంపై 12 కుట్లు వేసినట్టు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్ టీమ్స్ గా ఏర్పడి గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. పలు సెక్షన్ల కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Next Story