- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్వాల మర్డర్ కేసు..ఇంత టాలెంట్ ఉన్నోడిని ఎలా చంపేశార్రా.!
గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గద్వాలకు చెందిన తేజేశ్వర్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్న కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్య నెల రోజులు తిరగకముందే హత్య చేయించింది.

దిశ, వెబ్ డెస్క్: గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గద్వాలకు చెందిన తేజేశ్వర్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్న కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్య నెల రోజులు తిరగకముందే హత్య చేయించింది. ఐశ్వర్య తల్లి ఓ బ్యాంకులో స్వీపర్ ఉద్యోగం చేస్తుండగా ఆమెతో అదే బ్యాంకులో పనిచేసే ఉద్యోగితో ఎఫైర్ ఉంది. అతడితోనే ఐశ్వర్యకు కూడా అక్రమ సంబంధం ఉందని ముగ్గురూ కలిసి తేజేశ్వర్‌ను హత్య చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐశ్వర్య తేజేశ్వర్ ప్రేమించి పెళ్లి చేసుకోగా పెళ్లి తరవాత ఆమె ప్రవర్తన చూసి తేజేశ్వర్ హెచ్చరించినట్టు తెలుస్తోంది.
పెళ్లైన మరుసటి రోజు నుండే గంటలు తరబడి ఐశ్వర్య ఫోన్ మాట్లాడటం గమనించిన తేజేశ్వర్ ఆమెను హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తేజేశ్వర్ అడ్డుతొలగించుకోవాలని చూసిన ఐశ్వర్య బ్యాంక్ ఉద్యోగితో కలిసి అతడిని హత్య చేయించిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఐశ్వర్య ఆమె తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా బ్యాంక్ ఉద్యోగి పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే తేజేశ్వర్ గతంలో చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత టాలెంట్ ఉన్నవాడిని ఎలా చంపేశారురా అంటూ తేజేశ్వర్ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.






