ఆస్తి పంచాయితీ తేలదు.. మృత‌దేహం ముందుకు క‌ద‌ల‌దు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-21 14:23:16  IST  )

ఏపీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల వివాదంతో మూడు రోజులైనా చనిపోయిన చనిపోయిన తండ్రి డెడ్ బాడీని ఇంటిముందే పెట్టారు. ఈ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం పాత సొలస గ్రామంలో చోటు చేసుకుంది.

ఆస్తి పంచాయితీ తేలదు.. మృత‌దేహం ముందుకు క‌ద‌ల‌దు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల వివాదంతో మూడు రోజులైనా చనిపోయిన చనిపోయిన తండ్రి డెడ్ బాడీని ఇంటిముందే పెట్టారు. ఈ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం పాత సొలస గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు 85కు 20 ఎకరాల పొలం ఉండగా, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడు నాగేశ్వరరావు తెలంగాణలో స్థిరపడగా, చిన్నకుమారుడు తన భార్యతో కలిసి ఊర్లోనే నివాసం ఉంటున్నాడు. దీంతో చిన్నకొడుకు దగ్గర ఉంటున్న ఆంజనేయులు మూడు రోజుల క్రితం మరణించాడు. విషయం తెలిసిన పెద్ద కుమారుడు గ్రామానికి వచ్చి ఆస్తిలో తన వాటా తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

వాటాల పంపిణీ తరవాతనే అంత్యక్రియలు జరుగుతాయని భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో అన్ని బాధ్యతలు తానే చూసుకున్నానని, గతంలో రెండు ఎకరాలు ఇచ్చామని ఇంకా ఇచ్చేది లేదని చిన్నకుమారుడు తేల్చిచెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా డెడ్ బాడీని ఇంటి ముందే పెట్టారు. గ్రామ పెద్దలు చెప్పానా వినకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అంత్యక్రియలు నిర్వహించకపోతే తాము పంచాయతీకి అప్పగిస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ కుమారులు ఇద్దరూ తగ్గకపోవడంతో మృత‌దేహం ఇంటి ముందే ఉంది. దీంతో గ్రామస్తులు ఇబ్బందిప‌డుతున్నారు. కుమారుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Read more : ప్రేమ పెళ్లి.. మొన్న భార్య, నేడు భర్త మృతి

Next Story