- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనీస్ సైబర్ నేరగాడితో దోస్తీ..!
దిశ, సిటీ క్రైమ్ : ఆదిత్య బిర్లా గ్రూపు కంపెనీ పేరుతో ఫేక్ ప్రకటనను రూపొందించి ట్రేడింగ్ లో భారీ లాభాలు కల్పిస్తామని ఓ వ్యాపారీ నుంచి 32 లక్షలు

దిశ, సిటీ క్రైమ్ : ఆదిత్య బిర్లా గ్రూపు కంపెనీ పేరుతో ఫేక్ ప్రకటనను రూపొందించి ట్రేడింగ్ లో భారీ లాభాలు కల్పిస్తామని ఓ వ్యాపారీ నుంచి 32 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మోసాలకు పాల్పడుతున్న చైనా కు చెందిన సైబర్ నేరగాళ్లతో సంబంధం ఉన్న యువకుడిని బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేస్తుండగా అతనికి అదిత్య బిర్లా కంపెని పేరుతో ఓ ప్రకటన కనిపించింది. దానిని క్లిక్ చేయగా నేరుగా ఆదిత్య బిర్లా స్టాక్ ఏలైట్ గ్రూపు 678 వాట్సాప్ గ్రూపు లో చేర్చింది. ఆ తర్వాత గుర్తు తెలియని మహిళ ఫోన్ చేసి ఆయాన జోసేఫ్ స్టాక్ అడ్వైయిజర్ గా పరిచయమైంది. ఆయన జోసేఫ్ ఓ లింక్ ను పంపించి డౌన్ లోడ్ చేసుకోమని కోరింది. ఆ లింక్ తో అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని అందులో కేవైసీ, బ్యాంక్ వివరాలను బాధితుడు నమోదు చేశారు. ఆ తర్వాత మరో వాట్సాప్ గ్రూపు ఆదిత్య బిర్లా హై నెట్ వర్త్ ఐపీఓ ఎక్స్ క్లూజివ్ మెంబర్ షిప్ లో చేర్చారు. మీకు వచ్చే లాభాలకు 20 శాతం కమీషన్ ఇవ్వాలని కోరారు. అలా మొత్తం బాధితుడి నుంచి 32 లక్షలను పెట్టుబడులుగా పెట్టించి అతనికి కేటాయించిన ఖాతాలో పెద్ద మొత్తంలో లాభాలు చూపించారు.
వాటిని విత్ డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు కోటి రూపాయాలు ఇంకా డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. నిరాకరించడంతో అప్లికేషన్ పని చేయడం బంద్ అయ్యింది. అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నగదు బదిలీ అయిన ఖాతాలను పరిశీలించి ముంబయికి చెందిన ఉమర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతను ఈ మోసాలకు పాల్పడుతున్న చైనా దేశానికి చెందిన సైబర్ నేరగాడితో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉమర్ గుజరాత్ కు చెందిన రిషి తుషార్, వినాయక రాజేందర్ లతో కలిసి చైనీస్ సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను అందించి భారీగా కమీషన్ లు తీసుకొంటున్నారని గుర్తించారు. అంతే కాకుండా ఉమర్ వారి ఖాతాల్లో వచ్చిన చీటింగ్ నగదును క్రిప్టో కరెన్సిలోకి మార్చి దాదాపు 50 లక్షల రూపాయాలను చైనీస్ సైబర్ నేరగాళ్లకు పంపినట్లు గుర్తించారు. వీరు దాదాపు దేశ వ్యాప్తంగా నమోదైన 12 కేసులలో బ్యాంక్ ఖాతాలు ఇచ్చి చైనీస్ సైబర్ నేరగాళ్లకు సహకరించినట్లు తేలింది. దీంతో ఉమర్ ను అరెస్టు చేసి అతని నుంచి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ను విశ్లేషించినప్పుడు ఉమర్ టెలిగ్రాం యాప్ ద్వారా చైనీస్ సైబర్ నేరగాళ్లతో టచ్ లో ఉన్నాడని స్పష్టమైంది.






