- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వేచ్ఛ ఆత్మహత్య కేసు.. టీ న్యూస్ కార్యాలయానికి పోలీసులు
ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ (Poornachandar)ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఐదేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్న ఆయన వేధింపుల కారణంగానే తమ కూతురు మరణించినట్లుగా స్వేచ్ఛ తండ్రి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు చిక్కడపల్లి (Chikkadpally) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇవాళ వారు స్వేచ్ఛ పని చేస్తున్న బంజారా హిల్స్ (Banjara Hills)లోని టీన్యూస్ (T News) ప్రధాన కార్యాయానికి వెళ్లారు. స్వేచ్ఛతో కలిసి పని చేసిన సిబ్బంది నుంచి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆమె ఎవరితో ఎలా ఉండేది, ఎవరెవరితో మట్లాడేది, ఏ సమయంలో ఇంటికి వెళ్లేది లాంటి ప్రశ్నలను అడిగి స్వేచ్ఛ సహోద్యోగుల నుంచి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.






