- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగో తరగతి బాలుడు ఆత్మహత్య
దిశ, శేరిలింగంపల్లి : నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా

దిశ, శేరిలింగంపల్లి : నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై ఆంజనేయులు యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాజేంద్రరెడ్డి కాలనీలో భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న శంకర్ వాచ్ మెన్ గా పనిచేస్తూ తన పిల్లలను ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నాడు. శంకర్ కుమారుడు ప్రశాంత్ (9) స్థానికంగా ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో 4వ తరగతి చదువుతున్నాడు. రోజులాగే బడికి వెళ్లిన ప్రశాంత్ మంగళవారం స్కూల్ నుండి ఇంటికి వచ్చాక వారు నివాసం ఉంటున్న ఇంటి బాత్ రూమ్ లో తన స్కూల్ ఐడి కార్డుతో ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆత్మహత్యగా ధృవీకరీంచారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.






