ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-12 06:51:02  IST  )

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని సీలంపూర్ పరిధిలో ఉన్న జనతా మజ్దూర్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అందులో నివాసం ఉండే వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ ఇప్పటి వరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, బిల్డింగ్ కూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అసలు బిల్డింగ్ కూలిన సమయంలో అందులో ఎంతమంది ఉన్నారు.. ప్రాణనష్టంపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story